మనసులో ఎటువంటి లోతైన భావాలు పడకముందే విద్యార్ధులకి ఈ సత్యశోధన - శక్తిసాధన లోని విషయాలని తెలియజేయడం ద్వారా వారిలో ఆత్మస్టైర్యం పెరిగి జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా నిలదొక్కుకుని, గొప్పవారుగా ఎదిగే అవకాశం ఉంటుంది. దీనిని ఉపాధ్యాయులు కూడా అధ్యయనం చేసి విద్యార్ధులకి అందించాల్సిన అవసరం ఎంతగానో వుంది.
అనంతమైనశక్తి నీలోనే ఉంది అని వివేకానందుడు అందించిన సూక్తిని సత్యశోధన-శక్తిసాధన కార్యక్రమం ద్వారా విద్యార్థులకు చక్కగా అవగాహన కలిగించే విధంగా వివరించడం జరిగింది. భయాలకు, కోరికలకు, ఆత్మన్యూనతకు మూలాల్ని తెలుసుకోవటంద్వారా విద్యార్థులు శక్తివంతంగా తయారవటానికి వీలు కలుగుతుంది. సున్నితమైన ఈ జ్ఞానాన్ని ప్రతిస్కూలు, కాలేజిల్లో ఉపాద్యాయులు వారం వారం విద్యార్థులకు అందిస్తుంటే వివేకానందుడు కోరుకున్న గొప్ప యువత తయారవుతుంది.
లక్షలాది మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ శాఖల అధికారులకు, పూజారులకు, వేదపాఠశాల విధ్యార్థులకు “సత్యశోధనశక్తిసాధన” పై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆయన ఎవరివద్ద నుండి ఒక్కరూపాయి రుసుం కూడా తీసుకోకుండా సొంతకారులో 3 లక్షలకిలోమీటర్లకు పైగా ప్రయాణించి వేలాది శిక్షణా తరగతులు నిర్వహించారు.
టీచర్స్గా,పోలీస్ట్రైనింగ్ పొందుతున్న వారికి ఇది ఎంతో అవసరం. అంతే కాకుండా ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ ఇలా | ఎంతోమందికి మానసిక ఆందోళనలు లేకుండా ధైర్యాన్ని పెంచేవిధంగా ఈ కార్యక్రమం ఉన్నది.ఇలా ఎందరికో స్పూర్తినందించే మోహన్రావు గారి కృషి ఎంతో అభినందనీయం.